"వృక్షో రక్షతి రక్షితః Vruksho rakshati rakshitah"
మనకు తెలిసిన సత్యము: ఈ భూమి నుండి వచ్చిన ఈ శరీరము ఈ భూములోకే వెల్తుంది అని..అంటే మన శరీరానికి - భూమికి చాలా దగ్గర సంబంధం ఉంది కదా !! అలానే, మన పుట్టుక సమయం - విశ్వంలోని నక్షత్రంతో ముడివేస్తారు !! ఒక విధంగా, మన పుట్టుక - నక్షత్రము - పేరు...భూమి లోని చెట్టుకు ఏదో అవినాభావసంభందం ఉంది కదా !! 🤔 మన సంస్కృతీ ప్రకృతితో మమేకమైనది.
అశ్వని నక్షత్రము నుండి రేవతి నక్షత్రము వరకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతి ఒక నక్షత్రానికి ఒక్క చెట్టు చొప్పున కేటాయించబడింది. అలా అన్ని నక్షత్రాలకి సంభందించిన చెట్లు ఉన్న వనాన్ని, నక్షత్ర వనం అంటారు.
As per Vedic texts, every person born on Earth belongs to any one of the 27 nakshatras (stars) present in the universe. There are 27 stars, which are correspondingly correlated to 27 trees present on Earth. Garden with all those 27 Tree's are called Naksatra Vana - Mekala V. Reddy 🌱
నక్షత్రం పేరు, నాటవలసిన చెట్టు:
- అశ్వని నక్షత్రము - ముష్టి
- భరణి నక్షత్రము - ఉసిరి
- కృత్తిక నక్షత్రము - మేడి
- రోహిణి నక్షత్రము - నేరేడు
- మృగశిర నక్షత్రము - కాచు (నల్లచండ్ర)
- ఆరుద్ర నక్షత్రము - పిప్పలి
- పునర్వసు నక్షత్రము - వెదురు
- పుష్యమి నక్షత్రము - రావి
- ఆశ్లేష నక్షత్రము - నాగకేసరి
- మఖ నక్షత్రము - మర్రి
- పూర్వ ఫల్గుణి నక్షత్రము - మోదుగ
- ఉత్తర ఫల్గుణి నక్షత్రము - జాతి జువ్వి
- హస్త నక్షత్రము - అంపిలేపి (కొండ మామిడి)
- చిత్త నక్షత్రము - మారేడు
- స్వాతి నక్షత్రము - తెల్ల మద్ది
- విశాఖ నక్షత్రము - వెలగ
- అనూరాధ నక్షత్రము - పొగడ
- జ్యేష్ట నక్షత్రము - దేవదారు
- మూల నక్షత్రము - రోజము (నల్లోజము)
- పూర్వాషాఢ నక్షత్రము - అశోక
- ఉత్తరాషాఢ నక్షత్రము - పనస
- శ్రవణ నక్షత్రము - ఎర్ర జిల్లేడు
- ధనిష్ఠ నక్షత్రము - అనచండ్ర
- శతభిష నక్షత్రము - కదంబ
- పూర్వాభాద్ర నక్షత్రము - వేప
- ఉత్తరాభాద్ర నక్షత్రము - మామిడి
- రేవతి నక్షత్రము - ఇప్ప
- Surya (Sun) - Rui(Milk weed) - Calotropis gigantea
- Chandra (Moon) - Palash (Flame of forest) - Butea monosperma
- Budha (Mercury) – Apamarg (Prickly chaff flower) - Achyranthus aspera
- Shukra (Venus) – Umbar (Cluster fig) - Ficus racemose
- Mangal (Mars) – Khair (Cutch tree) - Acacia catechu
- Bruhaspati/ Guru (Jupiter) – Peepal (Sacred fig) - Ficus religiosa
- Shani (Saturn) – Shami (Spunge tree) - Prosopis cineraria
- Rahu (Dragon’s head) – Durva (Bermuda grass) - Cynadon dactylon
- Ketu (Dragon’s tail) - Darbha (Halfa grass) - Desmostachya bipinnata
వారం చెట్టు ధాన్యం స్తానం
- ఆదివారం తెల్ల జిల్లేడు
- సోమవారం మోదుగ సామలు
- మంగళవారం చండ్ర కందులు దక్షిణం
- బుధవారం ఉత్తరేణి పెసర్లు ఈశాన్యం
- గురువారం రావి సెనగలు ఉత్తరం
- శుక్రవారం మేడి చెట్టు చిక్కుడు
- శనివారం జమ్మి చెట్టు నువ్వులు
- రాహువు గరిక
- కేతువు దర్భ
- అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి, అల్లం కడుపు ఉబ్బరాన్ని & మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
- కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
- నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
- గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
- అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
- జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి & రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
- సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
- మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
- బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది. బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
- మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
- దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
- ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
- కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
- మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
- ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది. ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
- క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
- మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
- వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
- అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
- పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
- సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
- దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
- ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
- చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
- కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
- యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
- వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
- ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
- ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
- ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
- మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
- మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
నవధాన్యాలు, వినాయకుని పత్రపూజ మరియు మన పండుగలు మన సాంప్రదాయాలు ప్రకృతి లో భాగం, , వాటిని గౌరవించండి !!
నవధాన్యాలను దైవకార్యాల్లోను, శుభకార్యాలలోను ఉపయోగిస్తారు. వివాహ సమయంలో ఈ నవధాన్యాలను మట్టి మూకుళ్లలోపోసి ఉంచడమనే ఆచారం ఉంది. అవి మొలకెత్తి బాగా పెరిగితే ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని భావిస్తారు.[2]
నవధాన్యాలలో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉన్నాయి. వాటిని సమపాళ్లలో స్వీకరించినప్పుడే దేహానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. జీవితంలో కూడా అన్ని రకాల మనస్తత్వాలు గల వాళ్లని కలుపుకు పోయినప్పుడే, పరిపూర్ణత ఏర్పడుతుందనే విషయాన్ని కూడా ఇది స్పష్టం చేస్తుంది.
- రజో - సృష్టికి
- సాత్త్విక - స్థితికి
- తమో - లయకి కారకాలు
- Medicinal Plants @ B.Narayana pura Lake
- నవధాన్యాలు in Telugu
వినాయకుని ఏకవింశతి పత్రపూజ / పత్రాల విశేషాలు
- సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి। ( దవనం ): ఇది కుష్ఠు సంబంధ వ్యాధులను, బొల్లివంటి చర్మవ్యాధులను, నరాల సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఈ పత్రాలున్న పరిసరాల్లో ఎటువంటి సూక్ష్మక్రిములు దరిచేరవు.
- గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి। ( వాకుడాకు): ఇది ఆయాసాన్ని, దగ్గును, మలబద్దకము, అతివిరేచనాలను తగ్గిస్తుంది. బాలింతలకు ఈచెట్టు ఒక వరం. ఇది అనేక దివ్యౌషధాల తయారీకి ఉపయోగపడుతుంది.
- ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి। (మారేడు): ఇది నీటిని శుద్ధి చేస్తుంది. కీళ్ల సంబంధవ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను వృద్ధిచేస్తుంది. శరీర దుర్వాసనను తగ్గిస్తుంది.
- గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి ( గరిక ): ఇది దేహంలో రక్తాన్ని శుద్ధిచేస్తుంది. అధికరక్తస్రావాన్ని, రక్తహీనతను తగ్గిస్తుంది.
- హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి। (ఉమ్మెత్త):- ఊపిరితిత్తులను వ్యాకోచింప చేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.
- లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి। (రేగు ఆకు):- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.
- గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి। (ఉత్తరేణి): -దగ్గు ,ఉబ్బసంకి బాగా పని చేస్తుంది.
- గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి, తుర్యా పత్రం(తులసి):-శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.
- ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి, (మామిడి ఆకు):-నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.
- వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి। (గన్నేరు ఆకు):-గడ్డలు, పుండ్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు
- భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి, (పొద్దు తిరుగుడు ఆకు):- మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.
- వటవేనమః - దాడిమీపత్రం పూజయామి, (ఆకు):- వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.
- సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి, (దేవదారు ఆకు):-శరీర వేడిని తగ్గిస్తుంది.
- ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి, (మరువం ఆకు):-మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
- హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి (వావిలాకు):-కీల్లనోప్పులకు మంచి మందు.
- శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి, (జాజి ఆకు):- చర్మ రోగాలు,స్త్రీ సంభంద వ్యాధులకు మంచిది.
- సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి, (అడవి మొల్ల యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.
- ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి, (జమ్మి చెట్టు):-నోటి వ్యాధులను తగ్గిస్తుంది.
- వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి, (రావి ఆకు):-చాల ఓషధగుణాలు ఉన్నాయి.
- సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి। (మద్ది ఆకు):-రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.
- కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి। (జిల్లేడు ఆకు) :-నరాల బలహీనత ఉన్నవరికిది దివ్య ఒషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.
No comments:
Post a Comment